02పి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి విత్తనాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
సీఎం కేసీఆర్ చిత్రపటానికి విత్తనాభిషేకం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, జూన్ 29,( జనం సాక్షి ): నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంనందు టిఆర్ఎస్ పార్టీమండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో9వవిడత రైతుబంధు డబ్బులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగాసీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మాజీతొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విత్తన అభి షేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఎద్దు ఏడ్చిన ఎవుసం ,రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని అన్నారు. భారత దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేయడానికి అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతోటి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి 9 విడతలుగా 58 వేల కోట్ల రూపా యలను రైతుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్,నాయకులు ఆకుల కుమార్, తోట సత్యం,మల్లేష్,నరసింహ, నియోజకవర్గం లోని ఎంపీపీలు , జడ్పీటీసీలు , మండల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, సర్పంచులు , ఎంపీటీసీలు , రైతులు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి మూడు వందల మంది కార్యకర్తలు ఎమ్మెల్యే రాజయ్య సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.