1.అట్టుడుకుతున్న శ్రీలంక ` అధికారపార్టీ ఎంపీ మృతి..

share on facebook

 

 

100మందికిపైగా ఆందోనకారులకు గాయాలు

ఎట్టకేలకు ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా

` దేశంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం..

కొనసాగుతున్న ప్రజల ఆందోళనలు` కాల్పులు,

టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో పలువురికి గాయాలు

` పరిస్థితులు అదుపు తప్పడంతో దేశంలో ఎమర్జెన్సీ విధింపు

` ప్రజాప్రతినిధుల ఆస్తులు ధ్వంసం!

కొలంబో,మే9(జనంసాక్షి):శ్రీలంకలో గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొలంబోలో పార్లమెంట్‌ భవనం వద్ద శాంతియుతంగా నిరసనతెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది.ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ఈ ఘర్షణల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకొరాల మృతిచెందారు. నిట్టాంబువలో ఎంపీ కారును ఆందోళనకారులు అడ్డుకోగా.. ఆయన ఎస్‌యూవీ కారు నుంచి తుపాకీ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అక్కడి స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన నిరసనకారులు ఎంపీ కారును ధ్వంసం చేయడంతో ఆయన ఓ భవనంలో ఆశ్రయం పొందారనీ.. అక్కడే తన రివాల్వర్‌తో కాల్చుకున్నట్టుగా చెబుతున్నారు. ఆయన రివాల్వర్‌తో కాల్చుకొనే సమయంలో ఆ భవనం చుట్టూ వేలాది మంది జనం ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే, అక్కడ ఎంపీతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) కూడా విగత జీవిగా పడి ఉన్నట్టు పోలీసులు వెల్లడిరచారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇద్దరు మృతిచెందగా.. దాదాపు 100 మందికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చేరినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కొలంబోలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో పాటు తక్షణ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు.మరోవైపు, శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్‌స్టన్‌ ఫెర్నాండోకు చెందిన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆయనకు చెందిన హోటళ్లకు కూడా నిప్పంటించారు. మాజీ మంత్రి నిమల్‌ లాన్‌జా ఇంటిపైనా దాడి చేశారు. మొరటువా మేయర్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో ఇంటికి నిప్పటించారు. కొలంబోలో అధికార పార్టీ కార్మిక నేత మహింద కహండగామగె ఇంటిపైనా దాడి చేశారు. అలాగే, వలాల్‌వటియా ప్రదేశీయ సభ ఛైర్మన్‌ ఉడెని అతుకొరాల ఇంటిపైనా నిరసనకారులు దాడి చేశారు. ఎల్‌పీపీ ఎంపీ సనత్‌ నిశాంత ఇంటికి నిప్పంటించారు. ఎస్‌ఎల్‌పీపీ ఎంపీ అనుప పాస్కుల్‌ ఇంటిపై మధ్యాహ్నం దాడి చేశారు.శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆహార, ఇంధన, ఔషధాల కొరత నెలకొని ప్రజలు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. మరోవైపు, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి జనరల్‌ (రిటైర్డ్‌) కమల్‌ గుణరత్న విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా సైనిక బలగాలను రంగంలోకి దించారు. ఈ ఘర్షణలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపారు.శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామాశ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాలు, ప్రజల నిరసనలతో ఆయన గద్దె దిగాల్సి వచ్చింది.ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక విూడియా వర్గాలు వెల్లడిరచాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో రాజపక్స కుటుంబం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న నిరసనకారులపై.. ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో సోమవారం స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే రాజీనామా ప్రకటన వెలువడిరది.ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలో జరిగిన ప్రత్యేక కేబినెట్‌ సమావేశంలో.. మహింద రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కొనసాగుతోన్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడిరచారు. ప్రధాని రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దు కానుంది. కాగా, సోమవారం ప్రధాని రాజీనామా చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అందుకు తగ్గట్టే నిర్ణయం వెలువడిరది.ఇదిలా ఉంటే.. సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైన దగ్గరి నుంచి మహింద రాజపక్స ఆదివారం మొదటిసారి బహిరంగ ప్రదేశంలో దర్శనమిచ్చారు. అనురాధపురలో బౌద్ధాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. పవిత్ర ప్రదేశంలో దొంగలను నిషేధించాలంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విూరు ప్రధానిగా దిగిపోతే.. మేం విూకు పూజలు చేస్తాం’ అంటూ మరికొందరు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై రక్షణ శాఖ తీవ్ర ఆందోళ వ్యక్తం చేసింది. ఆందోళనకారులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, అత్యవసర సేవలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. ఇప్పటికే విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక.. మొత్తం 51 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. భారత్‌ తన ఆపన్న హస్తాన్ని అందించి, క్లిష్ట సమయంలో తనవంతు సాయం చేస్తోంది.

2.పాలమూరు`రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి` కృష్ణాజలాల్లో ముందు వాటా తేల్చండి

`  పచ్చిఅబద్దాలతో బిజెపి ప్రచారం` పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు` కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌నారాయణపేట,మే9(జనంసాక్షి):పచ్చి అబద్దాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే కొంత మంది కండ్లు ఎర్రబడుతున్నాయంటూ బీజేపీ నాయకత్వంపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.  చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయని కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సుష్మా స్వరాజ్‌ ప్రకటించిన మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు.కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికిమాలిన మాటలు, పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారికంగా లెక్కలు చెప్తున్నా.. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు మనకు కేటాయింపులు ఉండే. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతోంది.. అప్పట్నుంచి కేంద్రాన్ని అడుగుతున్నాం.. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల హక్కు ఇవ్వాలని, పంపకాలు తేల్చాలని అడిగాం. ప్రాజెక్టులు కట్టకుండా సతాయించిన జిల్లా పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండని 8 ఏండ్ల నుంచి కోరుతూనే ఉన్నాం. స్వయంగా మోదీని కేసీఆర్‌ అడిగారు. అయినా ఉలుకుపలుకు లేదు. సెక్షన్‌ 3 కింద బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేయాలని అడిగాం. దున్నపోతు విూద వానపడ్డట్టు ఉంది. ఉలుకు పలుకు లేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ªూలమూరు జిల్లాకు చేసిందేవిూ లేకపోగా పాదయాత్రలు చేస్తూ పచ్చికారుకూతలు, పచ్చి అబద్దాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. 299 టీఎంసీలకు సీఎం కేసీఆర్‌ ఒప్పుకున్నారని అబద్దాలు చెబుతున్నారు. దమ్ముంటే, పలుకుబడి ఉంటే, మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. సుష్మా స్వరాజ్‌ హైదరాబాద్‌లో సభ పెట్టి పాలూమురుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సుష్మా మాట నిలబెట్టి.. పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పక్కనే ఉన్న కర్ణాటకలోని తుంగభద్ర నదిపై ఉన్న అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇస్తరు. కానీ మేం అడిగితే వినబడనట్టు ముందుకు పోతరని అమిత్‌ షాను ఉద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అమిత్‌ షాకు నీతి, నిజాయితీ, సిగ్గు లజ్జ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, వెంటనే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తగ మాటలు చెప్పుడు కాదని అమిత్‌ షాపై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో స్థానపికనేతులకూడా పాల్గొన్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలినిరుద్యోగ యువత ఉద్యోగాలు లక్ష్యంగా అకుంఠిత దీక్షతో తమ చదువులు కొనసాగించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రబుత్వం ఉద్యోగ ప్రకటన విడుదల చేసినందున వారంతా ఉద్యోగాల సాధనలో నిమగ్నం కావాలన్నారు. రాబోయే ఆరు నెలల పాటు సోషల్‌ విూడియాకు దూరంగా ఉండి సీరియస్‌గా ప్రిపరేషన్‌ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ , కేటీఆర్‌తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో ఉద్యోగార్థులకు కేటీఆర్‌ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌ నగర్‌ పట్టణం పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విజ్ఞప్తి మేరకు మహబూబ్‌ నగర్‌ పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్‌ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడిరచారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పక్రియ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు ఇంతియాజ్‌, వాల్యా నాయక్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

3.రాజద్రోహాన్ని పున:పరిశీలిస్తాం

` వెనక్కుతగ్గిన కేంద్రం` సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు

దిల్లీ,మే9(జనంసాక్షి): బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని సమర్థిస్తూ రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం..తాజాగా యూటర్న్‌ తీసుకుంది. ఈ చట్టాన్ని పునః పరిశీలించాలనుకుంటున్నట్లు సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ మేరకు నేడు కొత్త అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది.’’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తి, ప్రధాని మోదీ దృక్పథంతో రాజద్రోహం చట్టంలోని 124ఏ సెక్షన్‌ నిబంధనలను పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశీలనలను కేవలం అధికారిక ఫోరమ్‌ మాత్రమే చేయగలదు. అందువల్ల ఈ ప్రక్రియ ముగిసేంత వరకు న్యాయస్థానం వేచి ఉండాలని కోరుతున్నాం. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రస్తుతానికి సమయం కేటాయించొద్దని విన్నవిస్తున్నాం’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.వలసపాలకుల నాటి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా? లేదా? అన్న అంశంపై ఈ నెల 10న వాదనలు వింటామని ఇటీవల వెల్లడిరచింది. దీనిపై గతవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.కాగా.. గతవారం విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రాజద్రోహం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయని, వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే 1962లో కేదార్‌నాథ్‌ కేసులో ఐదుగురు న్యాయమూర్తులిచ్చిన తీర్పును.. ఐదు లేదా ఏడుగురు జడ్జిల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేదార్‌నాథ్‌ కేసులో నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను గుర్తించింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌.. ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.దేశద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ మేజర్‌ జనరల్‌ ఎస్‌జీ వాంబత్‌కెరెతో పాటు పలువురు గతేడాది జులైలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటి విచారణను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘’మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల గళాన్ని అణగదొక్కేందుకు నాటి బ్రిటిష్‌ అధికారులు ఉపయోగించిన ఈ చట్టాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయట్లేదు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇవి మనకు అవసరమా?’’ అని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది అని అభిప్రాయపడిరది.

 

4.కామారెడ్డి ప్రమాద మృతులకు 2లక్షల పరిహారం` ప్రకటించిన ప్రధాని మోడీ

హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను స్పీకర్‌ పోచారం ఆదేశించారు.హసన్‌పల్లి ప్రమాద ఘటన విషాదకరమని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కవిత హావిూఇచ్చారు.కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన 14 మందికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా అసన్‌పల్లి గేట్‌సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి ఆవరణలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు.. వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. దుర్ఘటనతో ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించిన అనంతరం విూడియాతో మాట్లాడిన ఎస్పీ శ్రీనివాస రెడ్డి.. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు శ్రేయస్కరమైనవని పేర్కొన్నారు. ఆదివారం  పిట్లం మండలం చిల్లర్గి నుంచి టాటా ఏస్‌లో 25 మంది ఎల్లారెడ్డి వెళ్లారు. అక్కడ సవిూప బంధువు దశదిన కర్మ అనంతరం అంగడిదింపుడుకు వెళ్లి…. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అనంతరం తిరుగు ప్రయాణంలో డ్రైవర్‌ వాహనం వేగంగా నడపటంతో… ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆటోను ఢీకొన్న తర్వాత లారీ పక్కన ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలంలో డ్రైవర్‌ సాయిలు, లచ్చవ్వ అక్కడిక్కడే చనిపోయారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ అంజవ్వ, వీరమణి, సాయవ్వ, వీరవ్వ, గంగామణి మరణించారు. బాన్సువాడ ఆస్పత్రి నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా ఎల్లయ్య, పోచయ్య మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్‌ రోడ్డు కిందకు తప్పించినా లాభం లేకపోయింది. ప్రమాదసమయంలో డ్రైవర్‌ మద్యంమత్తులో ఉన్నట్లు…. గాయపడినవారు చెబుతున్నారు. డ్రైవింగ్‌ చేయొద్దని చెప్పినా వినకుండా….మత్తులో డ్రైవింగ్‌ చేశారని పేర్కొంటున్నారు.

 

5.ఉక్రెయిన్‌ ‘మాతృభూమి’ని రక్షించడానికే ఈ యుద్ధం` రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ వెల్లడిమాస్కో,మే9(జనంసాక్షి): పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ అన్నారు.నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి ‘మాతృభూమి’ని రక్షించుకోవడం కోసమే ఉక్రెయిన్‌లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు.రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ఏటా మే 9న ‘విక్టరీ డే’ పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్‌ స్క్వేర్‌ వద్ద పరేడ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా పుతిన్‌ ప్రసంగిస్తూ.. ఉక్రెయిన్‌లో రష్యా చర్యను రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్‌ పోరాటంతో పోల్చారు. ‘’ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య. ఉక్రెయిన్‌ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యా బలగాలు అక్కడ పోరాడుతున్నాయి’’ అని పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్‌ సైనికులకు ఆయన నివాళులర్పించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి నియో నాజీలను ఆ దేశం నుంచి తరిమి కొడతామని రష్యా చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే.నిజానికి ఈ విక్టరీ డే పరేడ్‌లో పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశంలో కొనసాగిస్తున్న ప్రత్యేక మిలిటరీ చర్యను ఇకపై పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అలాంటి ప్రకటనేవిూ ప్రస్తుతానికి లేకపోడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్‌ సైనిక చర్యను ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన క్రెమ్లిన్‌ ఆ తర్వాత జనావాసాలపై బాంబులు, క్షిపణులు వర్షం కురిపిస్తోంది. 11 వారాలుగా ఈ దండయాత్ర కొనసాగుతోంది. అయితే రష్యన్‌ సేనలను ఉక్రెయిన్‌ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. అమెరికా సహా పలు దేశాల ఆయుధ సహకారంతో రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. అయితే ఈ యుద్ధం ఇరువైపులా భారీ నష్టాన్నే మిగిల్చింది. వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఉక్రెయిన్‌లోని పలు నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి.

6.రుణాలకు అనుమతులివ్వండి` కాంగ్రెస్‌లో ఓటుకు నోటు యవ్వారం

` బిజెపిలో సీటుకు నోటు వ్యవహారం` ఇరు పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌` నిప్పులు చెరిగిన హరీశ్‌రావు ` జెపి నడ్డాకాదు..అవినీతికి అడ్డా అని విమర్శలుజయశంకర్‌ భూపాలపల్లి,మే9(జనంసాక్షి):రుణాలకు అనుమతులివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తదట.. ఇది మనం అనడం లేదు. కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఎవరో విూకు తెలుసు, ఓటుకు నోటు కేసులో ముద్దాయి. ఇలాంటి పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి విూరే హై కమాండ్‌. విూరు ఏది కోరుకుంటే అది చేసే పార్టీ. టీఆర్‌ఎస్‌ లేకపోతే, సీఎం గా కేసీఆర్‌ లేకపోతే భూపాలపల్లి జిల్లా అయ్యేదా.. భూపాలపల్లికి మెడికల్‌ కాలేజీ వచ్చేదా..? అని హరీశ్‌రావు అడిగారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 55 కోట్ల వ్యయంతో 200 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని తెలిపారు. రూ. 6 కోట్లతో రేడియోలజీ, పాథాలజీ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జేపీ నడ్డాపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడు తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును నడ్డా చదివారు. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వస్తున్నాయో, లేదా అనే విషయం తెలుసుకోవాలంటే భూపాలపల్లికి రావాలి. తమ రైతులను అడిగితే నీళ్లు వచ్చాయా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. చిట్టచివరి టేకుమట్ల దాకా నీళ్లు వచ్చాయన్నారు. ఆనాడు నీళ్ల కోసం రైతులు తమ కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తే.. నేడు నీరు చాలు, ఆపాలని రైతులు కోరుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. దమాక్‌ లేని మాటలు నడ్డా మాట్లాడారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అనడం సరికాదు.. ఈ ప్రాజెక్టుతో పంటలు విరివిగా పండాయని తెలిపారు. వరంగల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌పై కూడా హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ఏడేండ్ల కింద కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరిచిపోయారా? ఎరువుల బస్తాల కోసం లైన్లలో నిల్చున్న విషయం గుర్తుందా? అని రైతులను హరీశ్‌రావు అడిగారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వారి పాలనలో దర్శనమిచ్చేవని గుర్తు చేశారు. ధాన్యం అమ్ముకునేందుకు కూడా రైతులు ఎన్నో కష్టాలను అనుభవించారని పేర్కొన్నారు. కరెంట్‌ కోతతో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.  జేపీ నడ్డా కాదని.. అబద్దాలకు అడ్డా అని ఎద్దేవా చేశారు. ఒకరేమో మోకాళ్ల యాత్ర.. ఇంకొకరేమో పాదయాత్ర.. మరోకరేమో సైకిల్‌ యాత్ర అంటూ బయలుదేరారన్నారు. బీజేపోళ్లు, కాంగ్రెస్సోళ్లు పాలించే రాష్టాల్ల్రో కనీసం కరెంటు కూడా లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ల్రో కళ్యాణ లక్ష్మి లేదు… ఆసరా లేదు.. రైతు బంధు లేదా.. రైతుబీమా లేదు. నడ్డాకు దమాక్‌ ఉందా లేదా..? భూపాలపల్లికి రా.. ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు అందాయో చూపిస్తా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని సాక్షాత్తు పార్లమెంట్‌ సాక్షిగా విూ కేంద్రమంత్రే చెప్పిండు. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్‌ కాదా? కాంగ్రెస్‌ అంటేనే ఎరువుల కొరత.. కాంగ్రెస్‌ అంటేనే పవర్‌ కట్లు. ఎరువుల కోసం.. విత్తనాల కోసం కిలోవిూటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా? ఒక పార్టీ నేతేమో ఓటుకు నోటు కేసు దొంగ. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్‌ చేసే పార్టీకి చెందినవారు. కర్ణాటక(ఐజీసనిజీబిజీజీ)లో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట. ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారు. అలాంటి పార్టీలు అవి. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటని ఎద్దేవా చేశారు. మంత్రలు ఎర్రబెల్లి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

 

7.కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తాం

` పార్టీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది`

‘చింతన్‌ శివిర్‌’ మేధోమథన సదస్సులో సోనియా గాంధీ

దిల్లీ,మే9(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన, పునరుత్థానంలో భాగంగా ‘చింతన్‌ శివిర్‌’ పేరుతో ఉదయ్‌పుర్‌లో మేధోమథన సదస్సును నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.మే 13వ తేదీ నుంచి జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (అచిఅ) నేడు కీలక భేటీ నిర్వహించింది. సదస్సులో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాపై సీనియర్‌ నేతలతో చర్చలు జరిపింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కాంగ్రెస్‌ చీఫ్‌ దిశానిర్దేశం చేశారు.’కాంగ్రెస్‌ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసింది. ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇందులో ఎటువంటి మంత్రదండం లేదు. కేవలం క్రమశిక్షణ, దృఢసంకల్పం, ఇదివరకు జరిగిన నష్టాల నుంచి త్వరగా కోలుకోవడం వంటివే ప్రధానాంశాలు. దీన్ని ఒక సంప్రదాయ కార్యక్రమంగా చూడకూడదు. ఎన్నికలు, సైద్ధాంతికపరంగా ఎదురవుతోన్న సవాళ్లను అధిగమించి పునర్‌ నిర్మించే కార్యక్రమంగా నిలపాలి’ అని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్టీ వేదికలపై స్వీయ విమర్శలు అవసరమన్న ఆమె.. అవి ఆత్మవిశ్వాసం, నైతికత దెబ్బతినేలా ఉండకూడదన్నారు. పార్టీ పునరుద్ధరణకు గానూ నేతల మధ్య ఐకమత్యం, సంకల్పం, నిబద్ధత కలిగి ఉండాలని సీనియర్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయితోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రెబల్‌ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ ఈవిధంగా మాట్లాడారు.ఇక చింతన్‌ శివిర్‌ అజెండాను రూపొందించడంతోపాటు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. వివిధ స్థానాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ప్రస్తుతం మహిళలకు ఉన్న 33శాతం రిజర్వేషన్లు, జిల్లా స్థాయిలో అధిపతులను నియమించే అధికారాన్ని రాష్ట్రస్థాయికి కట్టబెట్టడం, భాజపాను అధిగమించే వ్యూహాలపైనా చర్చించారు.ఇదిలాఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా ‘నవసంకల్ప్‌ చింతన్‌ శివిర్‌’ పేరుతో మే 13, 14, 15 తేదీల్లో సదస్సు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ‘మిషన్‌ 2024’ పేరుతో కాంగ్రెస్‌ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శివిర్‌ ద్వారా పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలన్నది అధిష్ఠానం వ్యూహం. ఇందుకు సంబంధించిన అజెండాను రూపొందించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమయ్యింది.

 

 

9.ఢల్లీి షాహిన్‌ బాగ్‌ ప్రాంతంలో మళ్లీ బుల్‌డోజర్లు

అక్రమ కట్టడాల కూల్చివేతకు నిర్ణయంసుప్రీంను ఆశ్రయించిన సిపిఎంఅడ్డుకోలేమన్న సుప్రీం

న్యూఢల్లీి,మే9(జనంసాక్షి):దక్షిణ ఢల్లీిలోని  షహీన్‌ బాఫ్‌ులోని కలింది కుంజ్‌, జామియా నగర్‌ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం అధికారులు బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్నారు. మరోసారి బుల్డోజర్లు కనిపించటం ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్‌డీఎంసీ అధికారులు బుల్డోజర్‌లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. భాజపా పాలిత సౌత్‌ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. అక్రమ కట్టడాల పేరుతో చేపట్టిన కూల్చివేతలను వెంటనే నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి కూల్చివేతలు లేకుండానే ఎస్‌డీఎంసీ అధికారులు వెనుదిరిగారు. ఈ నిరసనల్లో స్థానికులతో కలిసి ఆప్‌ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్‌ పాల్గొన్నారు. అక్రమ నిర్మణాల తొలగింపు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించాం. ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు పని చేయటం సహా వారి భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాజకీయ పార్టీల కోరిక మేరకు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోలేం. కావాలంటే హైకోర్టుకు వెళ్లండి. వీధి వ్యాపారులు ఆక్రమిస్తే.. వాటిని తప్పకుండా తొలగిస్తారు. అక్రమంగా కట్టినా ఇళ్లను కూల్చి వేయకూడదని చెప్పే అధికారం ఎవరికీ లేదు’ అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.కాగా, దీనిని నిరసిస్తూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. షాహిన్‌ బాగ్‌ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ విచారణకు తీసుకోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతే కాకుండా ఈ విషయంతో తాము జోక్యం చేసుకోమని, ఏదైనా ఉంటే ఢల్లీి హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ణప్తి చేశారు.

 

10.నెల్లూరులో దారుణం

` ప్రేమను నిరాకరించినందుకు యువతిని తుపాకీతో కాల్చిచంపిన యువకుడు

` ఆపై తానూ కాల్చుకొని ఆత్మహత్య

పొదలకూరు,మే9(జనంసాక్షి):నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం మధ్యాహ్నం చోచుచేసుకుంది.ఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘’నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్‌రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరులో ఉండేవారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని గత కొంతకాలంగా కావ్యను సురేశ్‌ ఇబ్బంది పెడుతూ వచ్చాడు. సురేశ్‌రెడ్డి వైపు నుంచి ఏకపక్షంగా ప్రేమ వ్యవహారం నడిచింది. కావ్యకు సురేశ్‌రెడ్డి ఫోన్లు చేస్తూ మేసేజ్‌లు పెట్టేవాడు. పెళ్లి చేసుకుంటానని గత నెల యువతి ఇంటికి తన తల్లిదండ్రులను పంపించాడు. పెళ్లి ప్రతిపాదనను కావ్య తల్లిదండ్రులు నిరాకరించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కావ్య ఇంటికి సురేశ్‌రెడ్డి వెళ్లాడు. అడ్డువచ్చిన కావ్య చెల్లెలిని తోసేసి కాల్పులు జరిపాడు. కావ్యపై సురేశ్‌ రెండు రౌండ్లు కాల్పలు జరిపాడు. తొలిసారి జరిపిన కాల్పుల నుంచి కావ్య తప్పించుకుంది. రెండో రౌండ్‌ కాల్పుల్లో కావ్య తల నుంచి తూటా దూసుకెళ్లింది. కావ్య శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. తుపాకీపై మేడ్‌ ఇన్‌ యూఎస్‌ఏ అని ఉంది. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే వివరాలను ఆరా తీస్తున్నాం. సురేశ్‌కి చెందిన 2 సెల్‌ఫోన్లను సీజ్‌ చేశాం. సెల్‌ఫోన్‌ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎస్పీ వివరించారు.

Other News

Comments are closed.