10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ను జయప్రదం చేయాలి.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.పరిపూర్ణం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 9 జనంసాక్షి :

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కావునా జిల్లా లోని ఫెడరేషన్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.పరిపూర్ణం పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరిం చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేం దుకు ‘డిమాండ్స్ డే’ను చేపట్టినట్టు వివరించారు.డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.కలెక్టరేట్ ముందు శాంతియుత ప్రదర్శనలు చేపడుతామని అన్నారు. బ్యానర్లు, ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని డిమాండ్స్ డేను నిర్వహించాలని జిల్లా ఫెడరేషన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విస్తృతంగా పాల్గొనాలని కోరారు .అలాగే జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని చెప్పారు. డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్న దని తెలిపారు.పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాయితీని పూర్తిగా అమలుచేస్తూనే బస్సుపాసు సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు.పేదలైన జర్నలిస్టులను ఆదుకునేందుకు ‘జర్నలిస్టు బంధు’ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అలాగే కరోనా కాలంలో ఎత్తేసిన రైల్వే పాసులను పునరుద్ధరించా లనీ, రాయితీని వంద శాతానికి పెంచాలని కోరారు.ఈ సౌకర్యాన్ని కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.కలెక్టర్ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోనున్నట్లు ఆయన తెలిపారు.