*10% ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోద ముద్ర వేయాలి సిపిఐ*

వనపర్తి సెప్టెంబర్ 21(జనం సాక్షి)ముఖ్యమంత్రి తాజాగా గిరిజన ఆత్మీయ సభలో ఇచ్చిన హామీ మేరకు ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచుతూ వెంటనే జీవో జారీ చేయాలని సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కే విజయ రాములు డిమాండ్ చేశారు ఆ జీవో ను కేంద్రం ఆమోదించి వివాదానికి దించాలని కోరారు తద్వారా గిరిజనులకు న్యాయం చేకూర్చాలని బుధవారం ఒక పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిజర్వేషన్ పై కేంద్ర రాష్ట్ర రాజకీయ వివాదం మధ్య ఎస్టీలు నలిగిపోతున్నారని తెలిపారు  గత అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు 2017 లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపానంటున్నారని తెలిపారు సంబంధిత కేంద్ర మంత్రి  ప్రతిపాదన రాలేదంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో జీవో ఇస్తాం ,కేంద్రం ఆమోదిస్తుందో, మెడకు ఉరితాడు వేసుకుంటుందో ననటం తగదన్నారు. కేంద్రం ఆమోదం లభిస్తుందో లేదో తెలియకుండానే హామీ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అందువల్ల జీవో జారీ చేయడంతో పాటు కేంద్రం ఆమోదం సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.చత్తీస్గడ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచుతూ  జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ తాజాగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు
50 శాతానికి మించి రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించిందని తెలిపారు. ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు చేస్తే రిజర్వేషన్ 52 శాతానికి చేరుతుందని అందువల్ల ఎవరైనా కోర్టుకెళ్తే జీవో నిలవదని తాజా తీర్పు స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలవుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారని,ఏ ప్రాతిపదికన 69% రిజర్వేషన్ సాధించారో దాని ప్రాతిపదికగా ఇక్కడ రిజర్వేషన్ అమలుకు ముఖ్యమంత్రి కృషి చేయాలని పేర్కొన్నారు.
 *దాటవేత తగదు*
  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ రెండు విడతలుగా వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వంతో జరిపిన చర్చల్లో స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేయడం సరికాదని కే విజయ రాములు విమర్శించారు వారికి స్పష్టమైన హామీ ఇచ్చి వారి ఆందోళన విరమింపజేయాలని డిమాండ్ చేశారు ఆందోళనలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు 25వేల వీఆర్ఏల కుటుంబాల భవిష్యత్తుతో ముడివడిన ఈ అంశంపై ఇంత ఉదాసీనత తగదని హితువు పలికారు.