10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ముంబయి: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె చేశారు. బ్యాంకుల చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బ్యాకింగ్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఔట్సోర్సిగ్ను అనుమతించరాదని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల 70వేల శాఖలు పాల్గొన్నాయి