11న పశువైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 :  మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో ఈ నెల 11న పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సాయరెడ్డి తెలిపారు. పశుసంవర్థక శాఖ, మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.