11న మరోమారు లోక్‌ అదాలత్‌ నిర్వహణ

కరోనాతో కొద్దిరోజులుగా నిలిపివేశాం
సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌
గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): వచ్చే నెల పదకొండున మరోసారి లోక్‌ ఆదాలత్‌ ప్రారంభిస్తున్నామని సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ తెలిపారు. ప్రతి రెండు నెలలకొకసారి జాతీయ లోక్‌ ఆదాలత్‌ జరిగేదని…కరోనాతో కొద్దీ రోజులుగా లోక్‌ ఆదాలత్‌ నిలిపివేశామన్నారు. సెప్టెంబర్‌ 11న మరోసారి లోక్‌అదాలత్‌ను ప్రారంభిస్తామని…ప్రతి కోర్టులో ఒక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కక్షిదారులంతా ఈ లోక్‌ అదాలత్‌లో పాల్గొని కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఫిజికల్‌, వర్చువల్‌గా లోక్‌ అదాలత్‌ జరుగుతుందని ఆయన అన్నారు. భీమా కంపెనీలతో ముందస్తు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, చెక్‌ బౌన్స్‌ కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. రెండు లక్షల రూపాయలలోపు ఉన్న చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారం కోసం ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో 2266 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ సారి మరింత ఎక్కువ కేసుల పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. డీఎల్‌ఎస్‌ఏ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. లోక్‌ ఆదాలత్‌లో సెటిల్‌ అయితే అప్పిల్‌కు వెళ్ళే అవకాశం లేదని…్గªనైల్‌ జడ్జిమెంట్‌గా పరిగణిస్తారని రత్నప్రసాద్‌ వెల్లడిరచారు.