11 రాష్ట్రాల్లో సార్వత్రిక పోలింగ్‌ ప్రశాంతం

ఓటేసిన ఉప రాష్ట్రపతి, సోనియా, కేజ్రీవాల్‌ తదితరులు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం వరకు మం దకొడిగానే నమోదైన పోలింగ్‌ సాయంత్రానికి ఊపందుకుంది. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో తొలివిడతగా తొమ్మిది లోక్‌సభ స్థానాల కు గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. చింద్వారా, సాత్నా, రేవా, బాలాఘాట్‌, సిద్ధి, శాదోల్‌, మాండ్ల, జబల్‌పూర్‌, ¬సంగాబాద్‌ లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల నుంచి 118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 11 మిలియన్ల ఓటర్లు తమ ఓ టు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఉద యం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తంమీద పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీ కూడా ఇం దులో ఉంది. ఉదయమే సోనియా, ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ తదిత రులు ఓటేశారు. ఢిల్లీలోని 11, 500 పోలింగ్‌ స్టేషన్లలో 90 అత్యంత సమ స్యాత్మక, 327 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత నడు మ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ లోక్‌సభ ని యోజకవర్గంలో ఉదయం 11.30 గంటల సమయానికి 27.28శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్ము కాశ్మీర్‌లో దేశ సరి హద్దులను ఆనుకొని ఉన్న జమ్మూ నియో జకవర్గంలో ఉదయం 15 శాతం పోలింగ్‌ నమో దైనట్లు అధికారులు తెలిపారు. బీహార్‌లో 16 శాతం, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 22 శాతం,నతమబుద్ధనగర్‌లో 24 శాతం పోలింగ్‌ నమైదైంది.29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్ర దేశ్‌లో మిగిలిన 20 స్థానాలకు ఏప్రిల్‌ 17, 24 తేదీల్లో పొలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ నిదానంగా ప్రశాంతంగా జరుగుతోందని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఉదయం పది గంటల వరకు 18-20శాతం పోలింగ్‌ నమోదైనట్లు వారు తెలిపారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్‌లో
ప్రాంతంలోని గ్రావిూణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతంలో పోలింగ్‌ బాగా నమోదవుతోంది. గ్రామాల్లో మాత్రం నక్సల్స్‌ భయంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. బస్తర్‌ నియోజకవర్గంలో 1.29 మిలియన్ల మంది ఓటర్లున్నారు. ఈ స్థానానికి 8 మంది పోటీ పడుతున్నారు. బస్తర్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో 80శాతం అత్యంత సమస్యాత్మకమైనవిగా ఈసీ గుర్తించింది. బస్తర్‌ లోక్‌సభ పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలున్నాయి. భాజపా నుంచి సిట్టింగ్‌ ఎంపీ దినేష్‌ కశ్యప్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి దీపక్‌ కర్మ, ఆప్‌ నుంచి సోని సోరి బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 11లోక్‌సభ స్థానాలుండగా బస్తర్‌ స్థానానికి మాత్రం ఈ రోజు పోలింగ్‌ జరుగుతోంది. మిగిలిని పది స్థానాలకు ఏప్రిల్‌ 17, 24 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మత్తిలి సవిూపంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. మహూపొదర్‌ పోలింగ్‌ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేసి ట్రక్కుకు నిప్పుపెట్టి నాలుగు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. దీంతో చిత్రకొండ నియోజకవర్గం మహుపొదర్‌లోని 4 కేంద్రాల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. దేశరాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈరోజు జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏడు స్థానాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానా రాష్ట్రంలోని రోహతక్‌ నియోజకవర్గంలోని కోల్సి అనే గ్రామం ఇవాళ జరగాల్సిన పోలింగ్‌ను బహిష్కరించింది. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పేరు విషయంలో కోల్సి, దాని పక్కన ఉన్న భాకలి గ్రామాలకు మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదంలో భాకలి గ్రామస్థులు కోల్సిగ్రామస్థులపై దాడి చేయడం వల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గ్రామస్థులు రెండు రోజుల క్రితం పంచాయతి సమావేశం నిర్వహించి పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో గ్రామంలో ఈరోజు పోలింగ్‌ జరగడంలేదు. రోహతక్‌ నుంచి హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా కుమారుడు దీపీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి మూడు గంటల్లోనే 15 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరు లక్షల ఓటర్లు ఉన్న చండీగఢ్‌లో 17 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రైల్వేశాఖ మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎంపీ పవన్‌కుమార్‌ బన్సల్‌ సెక్టార్‌ 28 లోని పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి కిరణ్‌ ఖేర్‌ 101 సంవత్సరాల తన తండ్రితో కలిసి సెక్టార్‌ 8లో ఓటు వేశారు. అండమాన్‌, నికోబార్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లోనే 13 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 386 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఏకైక లోక్‌సభ స్థానానికి 15 మంది బరిలో ఉన్నారు. 3.86 లక్షల ఓటర్లు ఉండగా, వారిలో 12.75 శాతం మంది యువ ఓటర్లు. లోక్‌సభ మూడోదశ ఎన్నికల పోలింగ్‌లో యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యూఢిల్లీ, హర్యానా, కేరళ.. తదితర ప్రాంతాల్లో జరిగిన పోలింగ్‌లో కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు ఓటువేసేందుకు తరలివచ్చారు. అత్యధిక విద్యావంతులున్న కేరళ, ఢిల్లీల్లో ఓటింగ్‌ శాతం మందకొడిగా వున్నప్పటికీ తాజా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరోవైపు యువత ఎక్కువగా పాల్గొనే సామాజిక ప్రసార మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్ల్‌పస్‌ తదితర వేదికల్లో ఓటింగ్‌ జరిగే ప్రాంతాల్లోని యువత ఓటుహక్కు వినియోగించుకోవాలని వేలాది సందేశాలు వస్తున్నాయి. యువత తమ తొలి ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం సిరాగుర్తు వున్న వేలిని చూపిస్తూ వేలాది చిత్రాలను పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహులు గాంధీ తదితర ప్రముఖులు ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో సోనియా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు గురువారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రాంభం అయ్యింది. ఢిల్లీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ ఔరంగజేబ్‌ లేన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిలక్‌నగర్‌లోని పోలింగ్‌కేంద్రంలో ఆమ్‌ఆద్మీపార్టీ సమన్వయకర్త అరవింద్‌ కేజీవ్రాల్‌ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడోదశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌ కూడా నిర్మాణ్‌ భవన్‌లో ఓటు వేసిన వారిలో ఉన్నారు. భాజపా నాయకులు వరుణ్‌ గాంధీ, మీనాక్షి లేఖి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్‌, ఆప్‌ నాయకుడు మనోజ్‌ సిసోడియా రాఖీ బిర్లా, కిరణ్‌ బేడి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి వచ్చి ఢిల్లీలో ఓటు వేశారు. దేశరాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఈరోజు జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏడు స్థానాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలోని 11, 500 పోలింగ్‌ స్టేషన్లలో 90 అత్యంత సమస్యాత్మక, 327 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్‌, బిజెపి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీలతో ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 7 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలుపొందగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ కేవలం 8 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది.