తెలంగాణ సాంప్రదాయ పండుగలకు కేసీఆర్ పునఃర్ జీవనం తెచ్చారన్నారు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో గిరిజనుల సంస్కృతిలో భాగంగా బంజారాలు జరుపుకునే భాటీ..భాజీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఈ పండుగను మన యాసలో రొట్టె..పప్పు పండుగ అంటారు.

గత ప్రభుత్వాలు తెలంగాణ సాంప్రదాయ పండుగలను పట్టించుకోలేదన్నారు జగదీశ్ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగయ్యాయన్నారు. రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ పండుగలకు కేసీఆర్ తిరిగి పునఃర్ వైభవం తీసుకొచ్చారన్నారు.