12 మంది పరిస్థితి విషమం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు నగరంలోని 8 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. యశోద ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేర్‌ ఆసుపత్రిలో 20 మంది చికిత్స పొందుతుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ఓమ్నీ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పోందుతండగా ఇద్దరి పరిస్థితి ఆందోలనకరంగా ఉన్నట్లు సమాచారం తెలిసింది.