13న కిరణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తారు

– పార్టీ బలోపేతంకోసం అన్ని జిల్లాల ముఖ్యనేతలతో సవిూక్షలు నిర్వహిస్తా
– ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు పర్యటన ఉంటుంది
– కార్యకర్తలే పార్టీకి బలం
– కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక ¬దా సాధ్యం
– ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ
అమరావతి, జులై9(జ‌నం సాక్షి) : మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ధ్రువీకరించారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఊమెన్‌ చాందీ సోమవారం పర్యటనను మొదలు పెట్టారు. ఈ పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి గన్నవరం  విమానాశ్రయానికి చేరుకున్న చాందీకి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతూ.. ఈనెల 13న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీలో చేరనున్నారని స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతం కోసం జులై నెలాఖరు వరకు 13 జిల్లాల ముఖ్య నేతలతో సవిూక్షలు నిర్వహించనున్నట్లు ఊమెన్‌ చాందీ వెల్లడించారు. ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో పర్యటన కొనసాగుతుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే బలం అని ఊమెన్‌ చాందీ తెలిపారు. కొంత మంది నాయకుల అసత్య ప్రచారాల వల్ల పార్టీ బలహీన పడిందని తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకికవాద భావాలతో దేశాన్ని పరిపాలించ గల సత్తా కాంగ్రెసు కు ఉందన్నారు. ఒంటరిగానే ప్రభత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాలుగు సంవత్సరాల  పాలనలో దేశం, రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వగలిగిన శక్తి కాంగ్రెస్‌ కే ఉందని తెలిపారు. మోడి పాలనలో దేశంలో లౌకిక వాదం దెబ్బతిందని, జీయస్టీ వల్ల లక్షల మంది రోడ్డున పడ్డారని ఆయన పేర్కొన్నారు. కలసి కట్టుగా ప్రజల సమస్యలపై పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తేవాలని ఊమెన్‌ చాందీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పాల్గొన్నారు.