13మంది బలయ్యాక స్టెరిలైట్‌ కర్మాగారం మూసివేత

రోడ్డునపడ్డ కార్మికుల గురించి ఆలోచన చేయని సర్కార్‌
అలజడి చెలరేగకుండా ఏం చేయబోతున్నారో  చెప్పని పళనిస్వామి
చెన్నై,మే29(జ‌నం సాక్షి): ఓ 13 నిండు ప్రాణాలు బలైతే తప్ప సమస్యను గుర్తించలేకపోయారు. కాలుష్యం బారిన మమ్ములను పడేయవద్దని పోరాడిన కారణంగా 134 అమాయక ప్రాణౄలు గాలిలో కలసి పోయాయి. పిట్టలను కాల్చినట్లుగా కాల్చేశారు. మొత్తంగా  ప్రజాగ్రహానికి తమిళనాడు సర్కారు తలొగ్గింది.
కాలుష్యకారక స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు  ప్రకటించడంతో పోరాటంలో పాల్గొన్న సామాన్యప్రాజీనకం ఆనందం వ్యక్తం చేస్తోంది.  వేదాంత గ్రూప్‌నకు చెందిన ఈ ప్లాంట్‌కు సీల్‌ వేసి, శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. ఈ మేరకు ఓ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. వెంటనే ట్యూటికోరిన్‌(తూత్తుకుడి) జిల్లా ఉన్నతాధికారులు హుటాహుటిన స్టెరిలైట్‌ కర్మాగారానికి చేరుకుని కంపెనీ ప్రధాన గేటుకు జీవో కాపీని అతికించారు. ప్రభుత్వం జారీచేసిన జీవో వెంటనే అమల్లోకి వస్తున్నది. కర్మాగారాన్ని ఇక శాశ్వతంగా మూసివేస్తున్నాం అని ట్యూటికోరిన్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నండూరి చెప్పారు. మంగళవారం రాష్ట్ర శాసససభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి మారణకాండపై విపక్షాలు సభలో ఎదురుదాడికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలో విూడియాతో మాట్లాడుతూ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విస్తృత ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు. అయితే ఇందులో పనిచేస్తున్న వందలాది మంది కార్మికుల విషయం గురించి ప్రకటన చేయలేదు. వారిని ఎలా ఆదుకుంటారో చెప్పలేదు. రోడ్డున పడ్డకార్మికులను ఏ విధంగా ఆదుకుంటారో తెలియచేయలేదు. తూత్తుకుడిలో కాల్పుల అనంతరం కర్మాగారానికి విద్యుత్‌, నీళ్ల వసతులను నిలిపివేసినట్లు తనను కలిసేందుకు వచ్చిన ప్రతినిధుల బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఈ నెల 22న ప్రజలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారి పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు తూత్తుకుడి కాల్పుల్లో గాయపడి ప్రభుత్వ దవాఖానలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపడంతోపాటు, దవాఖానలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వాయు కాలుష్యానికీ, జల కాలుష్యానికీ కారణమవుతూ తమ ప్రాణాలను కొంచెం కొంచెంగా పీల్చేస్తున్న మాయదారి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మూసేయాలని కోరుతూ రోడ్డెక్కిన ఆందోళనకారులపై తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం కాల్పులు జరిగి 11మంది నేలకొరిగిన ఉదంతం అత్యంత విషాదకరమైనది.తూత్తుకుడిలో శాంతిభద్రతలు తిరిగి నెలకొనాలి. ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలి. ప్రజల డిమాండ్‌ను అమ్మ ప్రభు త్వం నెరవేర్చింది అని అన్నారు. 2013లోనే నాటి జయలలిత ప్రభుత్వం స్టెరిలైట్‌ కంపెనీ మూసివేతకు ఆదేశాలిచ్చారని, విద్యుత్‌ సౌకర్యం కూడా తొలగించారని సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. కానీ జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాలతో కంపెనీ తన కార్యకలాపాల్ని కొనసాగించిందని చెప్పారు. దీన్ని సుప్రీంకోర్టులో జయలలిత సర్కార్‌ సవాల్‌ చేసిందని ఈ పిటిషన్‌ ప్రస్తుతం అక్కడ పెండింగ్‌లో ఉందని తెలిపారు.  తమపాలిట మృత్యువుగా మారిన సంస్థ ఉండటానికి వీల్లేదని ఆగ్రహించినవారు ఆ క్రమంలో సొంత ప్రాణాలనే పణంగా పెట్టాల్సిరావడం ఎంత ఘోరం? ఇక కార్మికుల విషయంలోనే ప్రభుత్వం చిత్తశుద్ది చాటాల్సి ఉంది.
—————————