విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. స్వరూపరాణి తెలిపారు. గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అవగాహనపై జిల్లాస్థాయి సదస్సును నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ప్రతి మండలంలోను మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలతో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు, కళాజాతాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టామన్నారు. జిల్లాకు చెందిన 21 ప్రాజెక్ట్‌ల పరిధిలోగల కిశోర బాలికలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్‌వాడి సూపర్ వైజర్లు అవగాహన సదస్సును నిర్వహించి పౌష్టికాహారలోపం, కిశోర బాలికల సమస్యలు, బాల్యవివాహాలు సంబందిత చట్టాలపై సదస్సులో అవగాహన కల్పించనన్నట్లు తెలిపారు. సదస్సును జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సదస్సులో పాల్గొననున్నట్లు స్వరూపరాణి తెలిపారు.
తాజావార్తలు
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- మరిన్ని వార్తలు