14న హస్తినకు బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ఈ నెల 14న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లనున్నారు. నగదు బదిలీ పథకం అమలుపై ఢిల్లీ పెద్దలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. బొత్స వెంట నగదు బదిలీ ఎంపిక జిల్లాల డీసీసీ అధ్యక్షులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.