14న బాసర ట్రిపల్ ఐటి జాబితా
నిర్మల్,జూన్12(జనం సాక్షి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశ ఎంపిక జాబితాను వాయిదా వేశారు. సోమవారమే వీటిని విడుదల చేయాల్సిఉండగా.. అనివార్య కారణాలతో 14వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు కొందరు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంలో జాప్యం చేయటంవల్ల జాబితాను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. 14న సాయంత్రం మూ డు గంటలకు ప్రవేశ జాబితాను విడుదల చేస్తామని తెలిపారు.