14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, అమలాపురం, కాకినాడలలో ఇందిరమ్మ బాట కొనసాగనున్నది. ఆ మూడు రోజుల పాటు జిల్లాలోనే సిఎం బస చేయనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సాధక బాధకాలను తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులు ఒక ప్రణాళికను రూపొందించారు. ఇందిరమ్మ తొలుత 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు అధికారులు బుధవారంనాడు స్పష్టం చేశారు.