148 మందికి పద్మ పురస్కారాలు

5

న్యూఢిల్లీ,జనవరి23,(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ, యోగా గారు బాబా రామ్‌దేవ్‌, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, పండిట్‌ రవిశంకర్‌లను కేంద్రం పద్మ విభూషణ్‌ అవార్డులతో సత్కరించనుంది. బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వామిలకు పద్మభూషణ్‌ పురస్కారాలు లభించనున్నాయి. భారత హాకీ టీం కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌, తెలుగు తేజం-స్టార్‌ షట్లర్‌ పీవీ సింధులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌లను కూడా కేంద్రం పద్మ పురస్కారాలతో సత్కరించనుంది. ఈ నెల 25న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. ఎల్‌.కె.అద్వానీ, అమితాబ్‌,  శ్రీశ్రీ రవిశంకర్‌, బాబా రాందేవ్లకు పద్మవిభూషణ్‌ దిలీప్‌ కుమార్‌ ఎన్‌. గోపాలస్వామికి పద్మభూషణ్‌పి.వి.సింధు, సర్దార్‌ సింగ్లకు పద్మశ్రీప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, రజనీకాంత్లకు పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.