15రోజులకు తగ్గకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించాలి: సీపీఐ

హైదరాబాద్‌:ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు తగ్గకుండా నిర్వహించాలని సీపీఐ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ని కోరింది. మూడు సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యిందని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత గుండా మల్లేశ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో ముఠా రాజకీయాలు నడుపుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎలాంటి శ్రద్ధచూపడం లేదన్నారు. శాసన సభ హుందాగా నిర్వహించాల్సిన స్పీకర్‌ విఫలమయ్యారన్నారు. విద్యుత్‌ కోత, లక్ష్మీపేట  మారణకాండ, నిత్యావసరాల ధరల పెరుగుదల, వరుస కుంభకోణాలు, తెలంగాణ అంశంపై శాసనసభలో ప్రస్తావిస్తామని మలేశ్‌ చెప్పారు.