15 అడుగుల మేర పెరిగిన బెండ చెట్టు

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లాలోని మొలకలపల్లి మండల కేంద్రంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఇంటి పెరట్లో 15 అడుగుల బెండ చెట్టు ఉంది. సాధారణంగా బెండ చెట్టు నాలుగు అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ బెండ చెట్టు కాయలు కోయాలంటే ఎత్తైన నిచ్చేన సహాయం అవసరం ఎందుకంటే ఇది 15 అడుగులు ఉండి కాబట్టి. ప్రతి రెండు రోజులకొక్కసారి కేజి కాయలు వస్తాయని ఆ ఇంటి యజమాని రాంబాబు తెలిపారు. ఈ బెండ చెట్టు ఇంత ఎత్తుగా ఉండడంతో ఆ గ్రామంలోని వారంతా దానిని వింతగా చూస్తున్నారు.