15 శాతం పనులు రిజిస్టర్డ్‌ సొసైటీలకు ఇవ్వాలి

విజయనగరం, జూన్‌ 25 : జీఓ నంబర్‌ 581 ప్రకారం రిజిస్టర్డ్‌ సొసైటీలకు 15 శాతం పనులు అప్పగించాలనే నిబంధన ఉందని పురపాలక సంఘ కమిషనరు గోవిందస్వామి తెలిపారు. మిగిలిన 85 శాతం పనుల కోసం ప్రభుత్వం నిబంధనల మేరకు ఎవరైనా టెండర్లు వేయొచ్చన్నారు. కార్మిక సంఘాల నాయకులు టెండర్లు పిలవొద్దని అనడం సమంజసంగా లేదన్నారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఒప్పంద కార్మికుల సమ్మెతో ఏర్పడిన పరిస్థితులను పురపాలక సంఘ ప్రత్యేకాధికారి శోభ, పురపాలక సంఘ ప్రాంతీయ సంచాలకులు ఆశాజ్యోతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమ్మెవల్ల ఏర్పడిన పరిస్థితులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు జరిగే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు.