రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి

 

 

 

 

 

 

 

చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి)

రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. ఖాజాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల అఖిల 23 సంవత్సరాలు ఇవాళ ఉదయం ముందుగా ఇంట్లో తన కొడుకు రియాన్స్ గౌడ్ రెండు సంవత్సరాలకి ఉరేసి తర్వాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది మూడు నెలల క్రితం ఆటో నడుపుకునే తన భర్త ప్రవీణ్ గౌడ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఒకే ఇంట్లో భర్త చనిపోయిన మూడు నెలలకే కొడుకుకు ఉరేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం విషయం తెలుసుకున్న రామాయంపేట సిఐ వెంకట్ రాజా గౌడ్ శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ పోస్టుమార్టం నిమిత్తం రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుకున్నారు.