1500 కిలోమీటర్లకు చేరిన బాబు పాదయాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర 1500 కిలో మీటర్లు దాటిందని ఈ యాత్రను విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రజలకు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరేంద్రగౌడ్‌, బిసిసెల్‌ అధ్యక్షుడు రవికుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.  తొమ్మిది సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉంటు ప్రజల కష్ట నష్టాల్లో భాగస్వామ్యం కలుపుకుంటూ పాదయాత్ర చేపట్టడం హర్షణియమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చంద్రబాబు పాదయాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో 1468 కిలో మీటర్లు పాదయాత్ర చేయగా, బాబు 63 సంవత్సరాల వయస్సులో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం గర్వకారణమన్నారు.