రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారు
జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం
మండిపడ్డ బిజెపి నేత ఆదినారాయాణ రెడ్డి
అమరావతి,ఆగస్ట్10(జనంసాక్షి): రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఒక విధానం లేకుండా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసి దాన్ని సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. పాలన అంటే అప్పులు చేయడమేనా అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆరోపించారు. జీతాలకు కూడా అప్పులు తెచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై నీచమైన పదజాలంతో దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 25న సీఎం జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. జగన్ తనకు తానే గోతులు తవ్వుకుంటూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయని ఆదినారాయణ రెడ్డి అన్నారు. మంత్రులు బిజెపిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.
తాజావార్తలు
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- మరిన్ని వార్తలు