అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి ఎంటమాలజీ విధుల పర్యవేక్షణ

హైదరాబాద్,ఆగస్టు18 (జనంసాక్షి)
అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  నాగమణి ఎంటమాలజీ విధులను పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షణ లో భాగంగా 134 అల్వాల్ డివిజన్లోని రాజు వీకర్ సెక్షన్ కాలనీ లో ఇంటింటికి తిరిగి దోమల నివారణ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రక్కనే ఉన్న కొత్తచెరువు లోని గుర్రపుడెక్క తొలగించే పనులను మరియు బేబీ పాండ్ లోని చెత్తను ఎంటమాలజీ కార్మికులు తొలగించే పనులను పర్యవేక్షించడం జరిగింది. వర్షాకాలంలో దోమల ద్వారా డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి దోమ లార్వా పెరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించి, మరియు పెద్ద దోమల సాంద్రత ఎక్కువగా ఉన్న కాలనీలలో ఫాగింగ్ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచాలని అసిస్టెంట్ ఎంటమాలజీస్ట్ అనిల్ కుమార్ ను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజు శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.