వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించింది
మండిపడ్డ కాంగ్రెస్ ఎంపి రాహుల్
న్యూఢల్లీి,ఆగస్ట్26(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటీవల పేర్కొన్న నేషనల్ మోనటైజేషన్ పైప్‌లైన్, కోవిడ్ పరిస్థితి, టీకాల పక్రియ నెమ్మదిగా సాగడంపై ఒకదానితో ఒకటి ముడిపెడుతూ మండిపడ్డారు. ’ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తదుపరి వేవ్‌లో కేసులు సంఖ్యను నివారించేందుకు టీకాల వేగం పెంచాలి. కానీ కేంద్రం దేశాన్ని అమ్మేయడంలో బిజీగా ఉన్నందున, విూ పట్ల విూరు జాగ్రత్తగా ఉండండి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రంపై రాహుల్ గతంలో ఇదే తరహాలో విమర్శలు గుప్పించారు. కోవిడ్‌ను నియంత్రించడంలో కేంద్రం వైఫల్యాన్ని ఎత్తి చూపిన ఆయన.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో డోసుల కొరత, వ్యాక్సిన్ ధరలపై ప్రశ్నలు, ఆర్థిక వ్యవస్థె ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలపై కోవిడ్`19 ప్రభావం మోడీ సర్కార్‌ను ఎండగడుతూనే ఉన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ…4 లక్షల కోట్లు సంపాదిస్తున్న కేంద్రం, కరోనాతో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం అందించలేరా అంటూ ప్రశ్నించారు.