16 ఎంపి సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం
కేటీఆర్ సభకు భారీగా ఏర్పాట్లు
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి
నిజామాబాద్,మార్చి11(జనంసాక్షి): పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎంపి సీట్లను 16 కైవసం ఏసుకుని సత్తా చాటుతామని అన్నారు. ఈ నెల 13న నిర్వహించే కేటీఆర్ సన్నాహక సభకు 20వేల మంది నాయకులు, కార్యకర్తలను తరలించనున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో ఏర్పాట్లను పరిశీంచారు. సభను విజయవంతం చేసేందుకు కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిదిలో ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు వేల మందిని తరలించే విధంగా ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన షిండే తన నియోజకవర్గం నుంచి 35 వేల మందిని
తరలించాలన్నారు. ప్రతీ మండలం నుంచి మూడు వేల మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు, జడ్పీటీసీలు, రైతు సమన్వయకర్తలు, ఎంపీపీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభస్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకోవచ్చని అన్నారు. ప్రజలు ఆదరించి గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నేషనల్ రోడ్ల అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రగతి పథాన దూసుకుపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సయమంలో మ్యానిఫెస్టోలో పెట్టిన అన్ని హావిూలను నెరవేర్చేందుకు తొలి బడ్జెట్‌లోనే సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. కేటీఆర్ సభకు జుక్కల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలించేందకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తెలిపారు. లోక్‌సభ సన్నాహక సభను జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి చేపట్టే విధంగా కృషి చేయాలని మంత్రి వేములకు పనుల నివేదికను అందజేశారు.