16 నుంచి సమ్మెకు పిలుపు
కర్నూలు,జూలై7(జనం సాక్షి): గ్రామ పంచాయతీల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డిమాండ్ల సాధనకు జులై 16 నుంచి సమ్మెకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పిఎస్ రాధాకృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు.ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, గ్రామ కార్యదర్శులుగా ప్రమోషన్లు, టెండర్ విధానం, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు పిలుపునిచ్చామని అన్నారు. 2017 డిసెంబర్ 12న పిఎఫ్, ఇఎస్‌ఐ, 50 శాతం వేతనాల పెంపు, ప్రమోషన్లు, మట్టి ఖర్చులకు 20 వేల రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా క్షేత్రస్థాయి అధికారులు అమలు చేయడం లేదన్నారు. వాటి అమలు కోసం సమ్మె బాటకు సిద్ధం కావాలని కార్మికులకు కోరారు. సమ్మె నోటీసులు కింది స్థాయి అధికారులకు పంపామని, పెండింగ్ వేతనాల బకాయిలను తక్షణమే చెల్లిస్తామని హావిూ ఇచ్చారు.