17న జిల్లా బాక్సింగ్ జట్టు ఎంపిక
శ్రీకాకుళం, జూన్ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ తేదీన స్థానిక పిఎస్‌ఎన్‌ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది. రాష్ట్ర స్థాయి పోటీలు జులై 1నుంచి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎ.లక్ష్మణదేవ్ శనివారం నాడు ఇక్కడ తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలో పాల్గొనేందుకు 1996 నుంచి 2000 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వయస్సు ధ్రృవీకరణ పత్రాలతో హాజరై జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వి.మహేష్, శిక్షణకులు ఎం.ఉమామహేశ్వరరావును సంప్రదించాలని ఆయన తెలిపారు.