17న తుది ఓటర్ల జాబితా
నిర్మల్,మే10(జనం సాక్షి): నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కలిపి మొత్తం 8,86,102 మంది ఓటర్లు ఉన్నట్లు తుది నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,68, 892 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు, అవసరమైన మార్పులు, చేర్పులను మే 8లోగా స్వీకరిస్తున్నారు. మే 10 లోగా ఫిర్యాదులు, వచ్చిన వినతులను పరిష్కరిస్తారు. ఇప్పటికే మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పక్రియలన్నీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం చకచక పూర్తవగానే.. మే 17న తుది ఓటరు జాబితాను ప్రదర్శించి ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ఈ ఏడాది జూలైతో ముగుస్తుండగా.. పల్లె పోరుకు రాష్ట్ర ప్ర భుత్వం సిద్ధమవుతోంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా వేడి పెరుగుతోంది. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018ని తీసుకొచ్చింది. ఇప్పటికే కొత్త పంచాయతీలు, వార్డులు ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో 240గ్రామ పంచాయతీల నుంచి 396కు చేరగా.. ఆదిలాబాద్ జిల్లాలో 243 గ్రామ పంచాయతీల నుంచి.. 467లకు చేరాయి. ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తుండగా.. అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
———-