17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.

.

బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్.
జిల్లా కేంద్రంలో బిజెపి బైక్ ర్యాలీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్15(జనంసాక్షి):

సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్ డిమాండ్ చేశారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ,యువమోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ్య నాయక్ మాట్లాడుతూ నైజాం నియంతృత్వ పాలన విముక్తి కోసం అమరులైన వారెందరో ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంకు భయపడే ఓట్ల రాజకీయాలకు వొంగి తెలంగాణ విమోచన దినోత్సవం ను నిర్వహించడం లేదని విమర్శించారు.తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.ఈ సంబరాలు తొలిదశ తెలంగాణ అమరుల ను అవమానించినట్లేనని అన్నారు.కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఉద్యమకారులకు అవమానాలు కెసిఆర్ కుటుంబానికి సన్మానాలు జరుగుతున్నా యని అన్నారు.ముఖ్యమంత్రి పీఠం తొందరలోనే దిగి పోయే సమయం వస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో నాగర్ ర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ దిలీపాచారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొల్ దాస్ రాము,పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల రాధా రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణా రెడ్డి,టౌన్ అధ్యక్షులు ఎలిమే రాము బిజెవైఎం టౌన్ అధ్యక్షులు సుధీర్ గౌడ్ (చందు ),మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాఖీర్ హుస్సేన్,బిజెవైఎం నాయకులు నరేష్ చారి కోవూరు సంతోష్ కుమార్ తిమ్మాజీపేట్ శివ ఆనంద్ చారి బిజినపల్లి మండల ప్రెసిడెంట్ శ్రీ రాములు శ్రీకాంత్ చారి ,మహిళా మోర్చా నాయకురాళ్ళు కార్యకర్తలు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.