18న వికలాంగుల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న వికలాంగులు మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు శ్రీమైత్రి వికలాంగుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, వికలాంగుల పట్ల ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని  ఆరోపించారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్స రాలుగా వికలాంగుల సమస్యల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ 18న కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.