18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు కల్గివుండాలి.కలెక్టర్ జైతేష్ వి పాటిల్.
ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఓటర్లందరూ ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి సహకరించాలని కోరారు. ఫారం బి వినియోగించి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.ఫారం- 8 నింపి ఇంటి చిరునామా మార్పులు, సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్తగా ఓటర్ గా నమోదు ఇప్పుడు నాలుగు అవకాశాలు కల్పించిందని చెప్పారు. జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా అర్హత గల వారు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రికార్డులను, ఓటర్ల జాబితాలను పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు అందించే సేవలు, ఆధార నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ వెంకట్ రావు, బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.