1800 కోట్లతో కంతనపల్లి ప్రాజెక్టు పనులు : గండ్ర

శాయంపేట, అగస్టు 11 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాలో గల కంతనపల్లి ప్రాజెక్టు పనులను 1800 కోట్లతో త్వరలో ప్రారంభించనున్నట్లు చీఫ్‌ విప్‌, భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. శనివారం మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఇటివల అనారో గ్యంతో మరణించిన మామిడి రామలింగం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, కస్తూర్భా పాఠశాలను సందర్శించి పరిశీలించారు. తదనం తరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంతనపల్లి ప్రాజెక్టు పనులకు వైఎస్సార్‌ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిందని వాటి పనుల సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. జిల్లాను మావోస్టు ప్రభావిత కేంద్రంగా గుర్తించి 415 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. మొదటి విడతగా ములుగు డివిజన్‌లో 30 కోట్ల రూపాయలను ఖర్ఛు  చేసిందని అన్నారు. రెండో విడత భూపాలపల్లి నియోజక వర్గ అభివృద్ధికి 50 కోట్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు. పరకాల, భూపాలపల్లి రోడ్డు నిర్మాణం కోసం 8 కోట్లు వెచ్చించారని అన్నారు.