19జిల్లాల్లో పంటల బీమా అమలు పథాక

హైదరాబాద్‌:రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ పంటల బీమా సంస్థ డీజీఎం పి.నాగార్జున సూచించారు.బుధవారం హైదరబాద్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటల బీమూ అమలు తీరుతెన్నులు అంశం పై సదస్సు జరిగింది.ముఖ్య అతిధిగా విచ్చేసిన నాగార్జున మాట్లాడుతూ జాతీయ వ్యవసాయ పంటల బీమా పధకం 19 జిల్లాలో అమలవుతోందని తెలిపారు.ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగ పంటకు కడప.అనంతపురం,చిత్తూరు,కర్నూలు జిల్లాల్లో ప్రత్తిపంటకు ఆదిలాబాద్‌,ఖమ్మం వరంగల్‌ ఆయిల్‌ పాం పంటకు అమలు చేస్తున్నామన్నారు.చిత్తూరు జిల్లా మదనపల్లి రైతుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సహయంతో మొట్టమొదటి సారిగా టమోటా పంటకు బీమా పధకాన్ని అమలు చేస్తున్నట్లు నాగార్జున వెల్లడించారు రాష్ట్ర రైతులకు పంటల బీమా ప్రయోజనం సక్రమంగా అందడం లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీకి రూ.1000 కోట్లను తక్షణం విడుదల చేయాలని కోరారు కార్యక్రమంలో నాయకులు రామక్రిష్ణ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.