19నుంచి ఎపి ఈఎపి సెట్‌

కాకినాడ ,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌)కు ఆన్‌ లైన్‌లో ఇప్పటివరకూ 2,59,000 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌న్నారు. ఇంజనీరింగ్‌కు 1,75,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లోను, అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగానికి సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లోను పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించను కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా సెట్‌కు చైర్మన్‌గా వీసీ ఎం.రామలింగరాజు వ్యవహరిస్తునున్నామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ సూచించారు. రూ.5,000 అపరాధరుసుంతో ఆగస్టు 15వరకూ, రూ.10,000 చెల్లింపుతో 18 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.