2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే

జేఈఈ సెషన్- 2 పరీక్షల తుది కీ మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి విడుదల చేసినప్పటికీ.. కొద్దిగంటల్లోనే తొలగించింది. ఇందుకు కారణమేంటో తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఏ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం మరోసారి తుది కీని విడుదల చేసిన ఎన్టీఏ.. ఫిజిక్స్లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్లు పేర్కొంది. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి మరోవైపు, షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఏప్రిల్ 17 నాటికి ఫలితాలు విడుదల చేయాల్సి.. ఉన్నప్పటికీ.. నిర్ణీత గడువులోగా రిజల్ట్స్ ఇవ్వడంలోనూ విఫలమైందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో శుక్రవారం ఉదయం స్పందించిన ఎన్టీఏ.. ఏప్రిల్ 19 నాటికి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. అలాగే, ఈ మధ్యాహ్నం 2గంటల కల్లా తుది కీ విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఎదురుచూశారు.