20కిలోల ఎండు గంజాయి పట్టివేత

మెదక్‌: 20 కిలోల ఎండు గంజాయిని ఈ రోజు పోలీసులు పట్టివేశారు. కంగ్టి మండలం రాజారాం తండాపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో సంబంధం ఉందని భావిస్తోన్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.