2021జాతీయ సాధన సర్వే లో మన జిల్లా సంతృప్తికర ఫలితాలు సాధించలేదు.

అదనపు కలెక్టర్ మను చౌదరి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి):

ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తొలిమెట్టు జిల్లాస్థాయి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిసోర్స్‌పర్సన్ల కు తొలిమెట్టుపై నిర్వహిస్తున్న చివరిరోజు శిక్షణను జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులుతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సాధన సర్వే 2021లో నాగర్ కర్నూల్ జిల్లాసంతృప్తికర ఫలితాలు సాధించలేదన్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. దీంతో ప్రాథమికపాఠశాలలో అయిదో తరగతి పూర్తయ్యే సరికి ప్రతివిద్యార్థి ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించేలా ప్రణాళికలను రూపొందించు కోవాలన్నారు. రిసోర్స్‌పర్సన్లు బాగా నేర్చుకుని మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
విద్యార్థుల ఆసక్తిని తెలుసుకొని వారు రాణించే రంగాల్లో వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు.జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించి విద్యార్థులు అనర్గళంగా అన్ని సబ్జెక్టుల్లో మాట్లాడి చదివే విధంగాతీర్చిదిద్దాలన్నారు.
తొలిమెట్టు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి సతీష్, జిల్లా స్థాయి శిక్షణ రిసోర్స్‌ పర్సన్లు సాయిరెడ్డి, లక్ష్మీ నరసింహారావు, పాండు శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు