21న కుమారస్వామి ప్రమాణం

గవర్నర్‌ నుంచి ఆహ్వానం
బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక సిఎంగా కుమారస్వామి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సిఎంగా పరమేశ్వర ప్రమాణం చేస్తారు. కాంగరెస్‌,జెడిఎస్‌ల మధ్య కుదరిని అవగాహన మేరకు సిఎంగా కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ పిలపు కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం  విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వానికి అవకాశం దక్కింది. కర్ణాటక అసెంబ్లీలో 222 స్థానాలకు పోటీ జరగ్గా బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్‌ నెంబర్‌ 112ను దాటి కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమికి ఎమ్మెల్యేలుండటంతో గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దీంతో అట్టహాసంగా ప్రమాణా స్వీకరరానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు వివిద ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించే అవకాశం ఉంది.
యెడ్యూరప్ప పారిపోయాడన్న సిద్దరామయ్య
బలనిరూపణకు ఒప్పుకొని యడ్యూరప్ప అసమర్థుడిగా పరారవడం ప్రజాస్వామ్య విజయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. విశ్వాస పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ఆనందంలో మునిగి తేలారు. అనంతరం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రజాతీర్పును అంగీకరించడం ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యమని పేర్కొన్నారు. భాజపా నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని, ఎమ్మెల్యేల కొనుగోలును గవర్నర్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. ఇవాళ చారిత్రాత్మక రోజని, ఈ విజయం రాజ్యాంగం సాధించిన విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ఎదుర్కొనే సంఖ్యాబలం యడ్యూరప్పకు లేదని ప్రధాని మోదీ, అమిత్‌షా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చారన్నారు. జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ.. గవర్నర్‌ నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.