21 నుంచి సిపిఐ సందర్శన

విజయనగరం, జూలై 18 : పట్టణంలోని అన్ని వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని నిర్ణయించినట్లు సిపిఐ మండల కార్యదర్శి బుగత సూరిబాబు వెల్లడించారు. బుధవారం అమర్‌భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 23 వరకు అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడి ప్రజలను చైతన్య పరచి అధికారులపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. దీని కోసం కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.