శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ…..

చిలప్ చెడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండల పరిధిలోని చండూరు గ్రామంలోని గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వెండి నాగ పడిగెలు, ఒకటి వెండి మకర తోరణాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగలించినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి కి సంబంధించిన నాగపడిగెలు వెండి తోరణం ఈ వస్తువులు సమీప గ్రామంలోని ప్రజలు మీ బంధువులు గాని ఎవరైనా చూస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. ఇట్టి సమాచారాన్ని తెలుసుకున్న పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వాచ్మెన్ తుమ్మల నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఏఎస్ఐ తెలిపారు