దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సభల పోస్టర్ విడుదల

మల్దకల్ ఫిబ్రవరి 02 (జనంసాక్షి)జిల్లా కేంద్రంలోని హరిత టూరిజం హోటల్ నందు ఈ నెల 9వ తేదీన జరిగే దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహా సభల పోస్టర్లను గురువారం మల్దకల్ మండల జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి,ఎంపీపీ రాజారెడ్డిలు వేర్వేరుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దళిత జర్నలిస్టుల ఫోరం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటన్న మాట్లాడుతూ మొదటి సారి గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున దళిత జర్నలిస్టులందరు కలిసి మహా సభలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు అందరు హాజరు కావడం జరుగుతుందని,కావున ఇట్టి సభలకు తప్పకుండా హాజరుకావాలని జెడ్పీటీసీ, ఎంపీపీలను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టులు శాంతిరాజు,చిన్న కిష్టన్న,తిరుమలేష్, రజినీకాంత్,సుగంధర్ నాథ్,సత్యం తదితరులు పాల్గొన్నారు.