22న లోక్‌సభ అఖిలపక్షం: స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌

2

న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి):  పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాల దృష్ట్యా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈనెల 22న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 23వ తేదీ నుంచి బ్జడెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బ్జడెట్‌ సమావేశాల్ని సజావుగా జరపాలనే ఉద్దేశంతో స్పీకర్‌ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భాజపా ప్రభుత్వం జారీ చేసిన ఆరు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బ్జడెట్‌ సమావేశాల్లో బిల్లుల రూపంలో వాటిని ప్రవేశపెట్టనున్నారు. దీంతో అఖిలపక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాలకు ముందు స్పీకర్‌ అఖిలపక్షం నిర్వహించడంఆనవాయితీగా వస్తోంది. వివిధ అంశాలు, సభాకార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపైన చర్చిస్తారు. పార్లమెంట్‌ సమావేశాలు, చర్చకు వచ్చే అంశాలను కూడా చర్చిస్తారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.