22 నుంచి జగన్‌ అనంత యాత్ర

హైదరాబాద్‌,ఫిబ్రవరి16( జ‌నంసాక్షి ): రైతు భరోసా యాత్ర పేరుతో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టనున్న పర్యటన షెడ్యూల్‌ ఖరారయ్యింది. ఈమేరకు సోమవారం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పర్యటన వివరాలను వెల్లడించారు. ఈనెల 22 నుంచి 26 వరకూ వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా హావిూల అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతులు తాకట్టు పెట్టిన బంగారం తెచ్చిస్తామన్న చంద్రబాబు వేలం వేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ 421 జీవో జారీ చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.