గల్ఫ్ కార్మికుల కార్పొరేషన్ 500 కోట్లతో ఏర్పాటు చేయాలి..
-సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు
మల్లాపూర్, సెప్టెంబర్11 (జనం సాక్షి)రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మల్లాపూర్ మండల కేంద్రంలో స్థానిక భరతమాత కూడలి వద్ద చెన్నమనేని శ్రీనివాసరావు, గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు గుగ్గిల రవి గౌడ్, చెరుకు రైతు ఉద్యమకారుడు మామిడి నారాయణరెడ్డి తో గల్ఫ్ బాధితుల వందరోజుల దీక్ష గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ. గల్ప్కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల తో నిధి కేటాయించాలన్నారు. 2014 లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. గత ఎనిమిదిన్నర ఏళ్లలో 1800 మంది తెలంగాణ వలస కూలీలు గల్ప్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారన్నారు. ఇందుకు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ లో శవపేటికల రిజిస్టరే సాక్ష్యం అని శ్రీనివాసరావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ప్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్