ఘనంగా ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు.
తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)తాండూరు పట్టణంలోని 11వ వార్డ్ లో బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో వార్డ్ ప్రజలు కేక్ కట్ చేయడం జరిగింది.సోమవారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణం లోని సాయిపూర్ 9వ వార్డ్ లో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు నివాసంలో వార్డ్ ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ జనమ్మేచ్చిన నాయకుడు ,అలుపెరుగని నిత్యాశ్రమికుడు యువతరానికి స్ఫూర్తి ప్రదాత డా.రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వార్డ్, గ్రామాల్లో, మండలాల్లో నాయకులు ,కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్_రోహిత్_రెడ్డి పిలుపుమేరకు కేకులు కట్ చేస్తూ జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు.రంజిత్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, ప్రజా సేవాలో నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వార్డ్ ప్రజలుజంగప్ప,రమేష్,శ్రీనివాస్,వెంకటప్పా,నరేందర్,రాజు,భీరప్పతదితరులు పాల్గొన్నారు.