మల్కపేట రిజర్వాయర్ కు కర్రోళ్ల నర్సయ్య పేరు పెట్టాలి
వేములవాడ, సెప్టెంబర్ 18 (జనంసాక్షి): వేములవాడ పట్టణంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మల్కపేట రిజర్వాయర్ కు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ కర్రోళ్ల నర్సయ్య పేరుగా నామకరణం చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ కోనరావుపేట మండలం మల్కపేట వాస్తవ్యులు ఈ ప్రాంతం నుండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడినటువంటి మహనీయుడన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతోమంది పేదలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆయనన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మల్కపేట్ రిజర్వాయర్ కు కామ్రేడ్ కర్రోళ్ల నరసయ్య పేరు పెట్టకపోతే వేములవాడ డివిజన్ లోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని పేరు పెట్టేంత వరకు ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లారపు ప్రశాంత్,సిపిఎం నాయకులు వేణు, శ్రీకాంత్,భాను,ప్రవీణ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.