తొలి పూజల దేవుడు…గణపయ్య

శంకర్పల్లి సెప్టెంబర్ 18 (జననం సాక్షి )ముక్కోటి దేవతల ముద్దుబిడ్డ, శ్రీ గణనాతుని వినాయక చవితి పండుగ సందర్బంగా,స్థానిక విజయ పాల దుకాణం వద్ద… శంకర్ పల్లి సేవాఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకులను భక్తులకు పంచడం జరిగింది. ఈ సందర్బంగా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ మాట్లాడుతు పర్యావరణాన్ని కొద్దిగైన కాలుష్యం బారిన పడకుండ కాపాడాలని సేవా ఫౌండేషన్ ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఉపాధ్యక్షుడు సి. జై రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. వినేంద్ర చారి,సభ్యులు నోముల వెంకటేష్, అంజయ్య గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.