ఘనంగా తెలంగాణ సమైక్యత దినోత్సవం.

రాజంపేట్ సెప్టెంబర్17 (జనంసాక్షి)రాజంపేట్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ లో తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంపిపి లింగాల స్వరూప, తహసిల్దార్ అనిల్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంపత్,జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి గతంలో ముందుకు దూసుకుపోతు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో విన్నతన పథకాలకు దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం భారతదేశం లో కాకుండా నేరుగా నిజాం నవాబుల పాలనలో ఉండేదని 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో అంతర్భాగంగా విలీనమైన సందర్భంగా ఈ సమైక్యాంతా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. మండల రైతు బంధు జూకంటి మోహన్ రెడ్డి, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నల్లవెల్లి అశోక్, ఎంపీటీసీ సాగర్, మాజీ ఉపసర్పంచ్ ఆముదం నాగరాజ్, ఎంఈఓ, జతీయ జెండా ఎగురవేశారు. పంచాయతీకార్యదర్శులు అన్ని గ్రామాల సర్పంచులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.