మృతురాలు కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన తుడి మేఘారెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్18 (జనం సాక్షి )పెద్దమందడి మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామానికి చెందిన హరిజన్ బాలకిష్టమ్మా నిన్న మరణించగా అంత్యక్రియలకు నిమిత్తం గ్రామ కాంగ్రెస్ నేతలు
వనపర్తి నియోజకవర్గ నేత మేఘారెడ్డి
దృష్టికి తీసుకువెల్లగా మానవతా దృక్పథంతో స్పందించిన నేత దహణసంస్కారాల నిమిత్తం
5000 అయిదు వేలుఆర్థిక సహాయం ప్రకటించగ ఇట్టి సహాయాన్ని స్థానిక నాయకుల ద్వారా మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ రమేష్ , ఉప సర్పంచ్ సి ఆంజనేయులు ,సింగల్ విండో డైరెక్టర్ గౌని వెంకటేశ్వర రెడ్డి , వార్డ్ సభ్యులు ఈదమ్మా ,బాలు, అర్జునయ్య, కుర్మన్న, చిన్నయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.